కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తప్పుగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని.. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. ఈ క్రమంలో చిన్నరాత్రి జరిగిన గొడవలో.. కుటుంబ సభ్యులంతా అతనిపై దాడి చేయగా... అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో జరిగింది.
ఏం జరిగింది..
కడపలోని అశోక్ నగర్‌కు చెందిన మహబూబ్ బాషా పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో మహబూబ్ బాషా తన చిన్నమ్మతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం అతని చిన్నాన్నకు తెలియడంతో ఎందుకు ఇలా చేస్తున్నావనీ బాషాను మందలించాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. రాత్రి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు మహబూబ్ బాషాను కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాషా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
NARA LOKESH: 'జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. విధ్వంసం మాత్రమే ఉంది'