ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలి' - municipal workers protest Kadapa Municipal Corporation

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నగర అధ్యక్షులు సుంకర రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు.

municipal contract workers demand regularisation of services
కడప నగరపాలక సంస్థ ఎదుట కార్మికుల నిరసన

By

Published : Mar 30, 2021, 5:12 PM IST

అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్న ముఖ్యమంత్రి జగన్​... రెండేళ్ల అవుతున్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కడప అధ్యక్షులు సుంకర రవి ఆరోపించారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు.

20 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులనూ రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరమన్నారు. మున్సిపల్ కార్మికులను సచివాలయంలోకి తీసుకొచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల విలీనం తప్పనిసరైతే.. వాళ్లందర్నీ క్రమబద్ధీకరించిన తర్వాతనే విలీనం చేయాలన్నారు. కార్మికులకు పెండింగ్​లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను చెల్లించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details