MLC Ramachandraiah News: కడప మున్సిపల్ మైదానంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేశారు. అయితే ఈ సంద్భరంగా ఏర్పాటు చేసిన సభలో వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కడప సమీపంలోని చెన్నూరు చక్కెర కర్మాగారం మూతపడటానికి రాజకీయ నాయకులే కారణమన్న రామచంద్రయ్య.. ఈ పరిశ్రమ కోసం రైతులు పోరాటం చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - కడపలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య వ్యాఖ్యలు వివాదస్పదం
MLC Ramachandraiah Comments: కడపలో జరిగిన ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
కేసీ కెనాల్ కింద వరిపంట వేసే రైతులు నీళ్లుండి కూడా పొలాలు బీళ్లుగా పెట్టుకున్నారంటే కారణం ఎవరని ప్రశ్నించారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రభుత్వానికి రైతులే ఆదాయం తెచ్చిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ ముఖ్యమంత్రి ప్రజలు సైకిల్ అడిగితే.. కారు కొనిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజలు అడిగిన దానికంటే ఎక్కువగానే పథకాలను ముఖ్యమంత్రి ఇస్తున్నారన్న ఆయన.. అలా చేస్తే వనరులు లేక ఆదాయం పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదంవడి:
- SATYAKUMAR: వైకాపా ట్రాప్లో అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్: భాజపా నేత సత్యకుమార్
- సిద్ధూ కుటుంబానికి రాహుల్ పరామర్శ.. పంజాబ్ లాయర్ల కీలక నిర్ణయం!
- Jagan: వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభం.. ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్