ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BTech Ravi : జగన్ చేతకానితనం.. చేతివాటం వల్లే.. రాష్ట్రానికి ఈ దుస్థితి : బీటెక్ రవి

రాష్ట్ర ప్రయోజనం కంటే.. కమీషన్లే ముఖ్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం ఉందని ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతకానితనం.. చేతివాటం వల్లే రాష్ట్రానికి కష్టాలు వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

BTech Ravi
జగన్ చేతకానితనం వల్లే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు -బీటెక్ రవి

By

Published : Oct 13, 2021, 5:39 PM IST

రాష్ట్ర ప్రయోజనం కంటే కమీషన్లే ముఖ్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం ఉందని ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతకానితనం, చేతివాటం వల్లే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఛార్జీల పెంపు, విద్యుత్ కోతలతో రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కేంద్రం చెప్తుంటే, బొగ్గ కొరత ఉందంటూ జగన్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

విద్యుత్ లోటు తలెత్తకుండా చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన వ్యవస్థను నాశనం చేశారని రవి దుయ్యబట్టారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా.. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆపాలంటూ ప్రజలకు ఉచిత సలహాలివ్వడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఇదీ చదవండి : Power Crisis: రాష్ట్రంలో విద్యుత్ కొరత... పరిశ్రమలకు సరఫరాలో కోత!

ABOUT THE AUTHOR

...view details