ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIVEKA DEATH CASE: 'వివేకా హత్యలో పెద్ద తలకాయ...అంతా ఆయన డైరెక్షన్​లోనే..' - దస్తగిరి

వివేకా హత్య కేసు(VIVEKA DEATH CASE)లో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. దీని వెనుక పెద్ద వ్యక్తి ఉన్నారని.. సీబీఐ వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

mla ravindranath reddy
mla ravindranath reddy

By

Published : Nov 17, 2021, 8:20 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు(VIVEKA DEATH CASE)లో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు మాత్రమే వివేకా హత్యకేసులో హడావుడి బయటికి వస్తుందని.. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ పిటిషన్, సిట్ గతంలో చేసిన విచారణలో అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా లేదన్నారు.

బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదమే వివేకా హత్యకు దారి తీసినట్లు తెలుస్తోందన్న రవీంద్రనాథ్ రెడ్డి.. హత్య చేసిన వారి వెనుక పెద్ద శక్తి, తలకాయ ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. హత్య వెనకున్న శక్తులను సీబీఐ బయటికి తీయాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాధారాలు లేకుండా తుడిచి వేయడం చూస్తే ఎవరో పెద్ద వ్యక్తుల డైరెక్షన్​లో ఇదంతా నడుస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. హత్యకు ముందు జరిగిన పరిణామాలను సీబీఐ వెలికితీసి అసలు దోషులను పట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వివేకానందరెడ్డి చాలాసార్లు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించారన్న ఆయన.. వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details