ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విలేకర్లను అనుమతించకపోతే నేనూ వెళ్లిపోతా: వైకాపా ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి వార్తలు

సమీక్ష సమావేశానికి విలేకరులను అనుమతించకపోతే తానూ వెళ్లిపోతానని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. నివర్ తుపానుపై కడపలో మంత్రి, ఉపముఖ్యమంత్రి ఆధర్యంలో సమీక్ష జరిగింది. దీనికి విలేకరులను అనుమతించకపోవడాన్ని ఎమ్మెల్యే విభేదించారు. వారిని అనుమతిస్తేనే తానూ ఉంటానని పట్టుబట్టటంతో.. చివరికి మంత్రి ఆదిమూలపు సురేశ్ జర్నలిస్టులకు అనుమతి ఇచ్చారు.

rachamallu prasada reddy
రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే

By

Published : Dec 7, 2020, 2:09 PM IST

Updated : Dec 7, 2020, 2:46 PM IST

రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే

అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తున్న తరుణంలో అధికారుల సమీక్ష సమావేశానికి విలేకరులను అనుమతించకపోవడం సరైనది కాదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్​లో నివర్ తుపానుపై ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

విలేకరులు ఫొటోలు తీసుకొని 2 నిమిషాల అనంతరం వెళ్లిపోవాలని మంత్రి అనడంపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పందించారు. విలేకరులు లేకుంటే తాను సమావేశం నుంచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చుని సమావేశాలు నిర్వహించడం సరైనది కాదని.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విలేకరులను సమావేశానికి అనుమతించకపోవడం మంచిది కాదని వాదించారు. జర్నలిజం లేని సమావేశం ఎక్కడా ఉండదన్నారు. అనంతరం మంత్రి విలేకర్లను సమావేశానికి అనుమతించారు.

Last Updated : Dec 7, 2020, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details