ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుబ్బయ్య హత్యతో సంబంధం లేదంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం - ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం న్యూస్

తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్యతో సంబంధం లేదని.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈమేరకు చౌడేశ్వరి ఆలయంలో ప్రమాణం చేశారు. తెలుగుదేశం నేతల ఆరోపణలకు భయపడి ప్రమాణం చేయడం లేదని ప్రజల కోసమేనని చెప్పారు.

mla rachamallu
mla rachamallu

By

Published : Jan 1, 2021, 12:39 PM IST

నందం సుబ్బయ్య హత్యతో సంబంధం లేదంటూ.. ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం

కడప జిల్లా పొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు సుబ్బిరెడ్డి కొట్టాలలోని చౌడమ్మ ఆలయంలో ఆయన ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్య హత్య తన చేతులతో చేపించలేదని.. తన నోటితో చెప్పలేదని ఆయన ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్య హత్యకు గురవుతాడు అన్న విషయం తనకు ముందు తెలియదన్నారు. ముందే తెలిసి ఉంటే కచ్చితంగా ఆపేవాడినని ఎమ్మెల్యే అన్నారు.

ABOUT THE AUTHOR

...view details