కడప నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కరోనా పరీక్షలకు సంబంధించిన టార్గెట్లను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. సోమవారం కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో కొవిడ్- 19పై నియోజకవర్గ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజరై ప్రసంగించారు.
'వైద్య సిబ్బంది లక్ష్యాలను పూర్తి చేయాలి' - కడప తాజా వార్తలు
కడప నియోజకవర్గంలో కరోనా నిర్ధరణ పరీక్షల విషయంలో వైద్య సిబ్బంది తమకిచ్చిన లక్ష్యాలను చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజలు సైతం సహకారం అందించాలని కోరారు.
deputy cm amjad basha
నియోజకవర్గంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చని వెల్లడించారు. హోటళ్లు రాత్రి 9 వరకు పార్సిళ్ల ద్వారా విక్రయాలు నిర్వహించుకోవచ్చన్నారు. కరోనా కట్టడి విషయంలో అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.