committed suicide: వివేక హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి సమీప బంధువు మస్తాన్ వలీ ఆత్మహత్య చేసుకున్నారు. పులివెందులలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న మస్తాన్ వలీని.. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Suicide: వివేక హత్య కేసులో అప్రువర్ దస్తగిరి బంధువు ఆత్మహత్య - వివేక హత్య కేసులో అప్రువర్ దస్తగిరి
Mastan Wali committed suicide: వివేక హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సమీప బంధువు మస్తాన్ వలీ అప్పుల బాధతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వలీని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన ఆత్మహత్యకు అప్పులే కారణమని మస్తాన్ వలీ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మస్తాన్ వలీ ఆత్మహత్య
అయితే చనిపోవడానికి ముందు చావు బతుకుల్లో ఉన్న మస్తాన వలీ నుంచి పులివెందల ఆసుపత్రిలో మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పులు ఎక్కువ కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డానని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి