ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

suicide: పెళ్లైన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య.. - Married woman commits suicide in Kadapa

ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఆ యువతి. కానీ ఆ కలలు కన్నీళ్లుగా మిగిలాయి. అదనపు కట్నం తేవాలంటూ అత్త వేధింపులు మెుదలయ్యాయి. తోడుగా నిలవాల్సిన భర్త.. తల్లితో చేరి హింసించాడు. డబ్బుతోనే ఇంట్లో అడుగు పెట్టాలంటూ.. ఆమెను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. అత్తింట్లో వేధింపులు.. పుట్టింటి వారు తన కారణంగా నవ్వులపాలు అవుతుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళ.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.

married women commited suicide
వివాహిత ఆత్మహత్య

By

Published : Sep 14, 2021, 12:57 PM IST

పెళ్లి అయి నెల రోజులు కాకుండానే అత్తింటి వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్​లో జరిగింది. కడపకు చెందిన ఝాన్సీకి రాజంపేట బోయినపల్లికి చెందిన రాధాకృష్ణకు ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కట్నకానుకల కింద 15 లక్షలు ఇచ్చారు. రాధాకృష్ణ బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్​​గా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి అయిన రెండో రోజు నుంచి అధిక కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు.

70 లక్షలు ఇస్తేనే కాపురం..

ఈ క్రమంలో డబ్బుతోనే తిరిగి రావాలంటూ.. ఈనెల 2వ తేదీ అమ్మాయిని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయారు. అందరూ కలిసి రెండు రోజుల కిందట రాజంపేటకు వెళ్లి పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు. తనకు 70 లక్షలు డబ్బులు కావాలని లేదంటే కాపురానికి తీసుకెళ్లనని.. రాధాకృష్ణ చెప్పాడు. తన వల్లే కుటుంబ సభ్యులు నవ్వులపాలు అవుతున్నారని ఉద్దేశంతో ఝాన్సీ ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ..పకడ్బందీగా సాగని జ్వరాల సర్వే.. అంతంత మాత్రంగానే దోమల నివారణ..

ABOUT THE AUTHOR

...view details