లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకోవడానికి మార్గదర్శి సంస్థ సిబ్బంది ముందుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలో 150 మంది పేదలకు నిత్యావసరాల కిట్లు అందజేశారు. 20 మంది నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసరాలు అందించడంతో పాటు మరో 130 మందికి ఈ కిట్లు అందించినట్లు మార్గదర్శి ఛిట్‌ఫండ్ కాకినాడ బ్రాంచ్ మేనేజర్ దాసరి ప్రసాద్ చెప్పారు.
‘మార్గదర్శి’ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన లాక్డౌన్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. కాకినాడలో మార్గదర్శి ఛిట్ఫండ్ సిబ్బంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
margadasi Chit fund