ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కే మాల మహానాడు మద్దతు: కారెం శివాజీ - కడప తాజా వార్తలు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనితీరును మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ కొనియాడారు. కడపలోని సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో తమ మద్దతు, అండదండలు జగన్​కే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించలేని భాజపాకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని విమర్శించారు.

karem sivaji supports cm jagan
జగన్​కు మద్దతు ప్రకటించిన కారెం శివాజీ

By

Published : Jan 10, 2021, 3:36 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు తమ అండదండలు ఎప్పటికీ ఉంటాయని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ స్పష్టం చేశారు. ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి ఓర్వలేక తెదేపా, భాజపా, వామపక్షాలతో పాటు.. చివరకు ఎన్నికల కమిషన్ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తుందని శివాజీ అన్నారు. కడపలోని సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడుతూ.. హర్షకుమార్, శ్రావణ్ కుమారులు తెదేపా జెండా కప్పుకొని చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. వీరి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని హెచ్చరించారు.

కరోనా కష్టకాలంలో నెలకు రెండుసార్లు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తూ.. పింఛన్లు పంపిణీ చేస్తూ సీఎం అందరినీ ఆదుకున్నారని అభినందించారు. భారతదేశం మొత్తం గర్వించే విధంగా జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఆలయాలపై దాడులు చేసి వాటిని వైకాపాకు ఆపాదించారంటూ శివాజీ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించలేని భాజపాకు.. వైకాపాను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details