shivaratri festival: రాజంపేట పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని ఏర్పాటు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని ఓం శాంతి శిక్షకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ రుద్రాక్షలను నేపాల్ నుంచి తెప్పించినట్లు ఆమె పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, పురపాలక చైర్మెన్ పోలా శ్రీనివాసరెడ్డిలతో పాటు పలువురు మహా శివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి రుద్రాక్ష శివలింగాన్ని కనులారా వీక్షించి తరించారు. మూడు రోజులపాటు భక్తుల కోసం రుద్రాక్షలతో తయారుచేసిన ఈ మహా శివలింగాన్ని ప్రదర్శనకు పెట్టనున్నట్లు నిర్వాహకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంశాంతి ప్రతినిధులు డాక్టర్ శివకేశవులు, చలపతి, కుబేరుడు, రాజేశ్వరి, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
rudraksha shiva lingam: లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం.. ఎక్కడంటే? - రాజంపేటలో మహా శివలింగం
shivaratri: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుత సన్నివేశం కడప జిల్లా రాజంపేటలో జరిగింది.
![rudraksha shiva lingam: లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం.. ఎక్కడంటే? rudraksha shiva lingam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14606695-394-14606695-1646144589909.jpg)
లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం
లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం