వైఎస్‌ఆర్ జిల్లాలో.. గ్రామ సచివాలయానికి తాళం! - అద్దె చెల్లించలేదని గ్రామ సచివాలయానికి తాళం
12:57 May 19
గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని గుర్రమ్మ
వైఎస్‌ఆర్ జిల్లా గూడెంచెరువులో గ్రామ సచివాలయానికి యజమాని గుర్రమ్మ తాళం వేశారు. జమ్మల మండలం గూడెంచెరువు గ్రామంలో 10 నెలల కిందట అద్దె భవనంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నెలకు రూ.5వేల చొప్పున అద్దె చెల్లించేలా సచివాలయ ఉద్యోగులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10 నెలలుగా గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించకపోవడంతో యజమాని గుర్రమ్మ సచివాలయానికి తాళం వేశారు. గ్రామ సచివాలయం అద్దె చెల్లించే వరకు తాళం తీసేది లేదని తేల్చి చెప్పారు. 10 నెలల అద్దె రూ.50వేలు చెల్లించాలని యజమాని గురమ్మ చెబుతున్నారు. గ్రామ సచివాలయానికి తాళం వేయడంతో... సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: