మంగళవారం నుంచి కడపలో లాక్డౌన్ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. కడపలో పాజిటివ్ కేసులు పెరగడం వల్ల నగరంలో పటిష్ఠ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ మేరకు డీఎస్పీ తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, ఆర్అండ్బి అధికారులు నగరంలోని ప్రాంతాలన్నింటినీ పర్యటించారు. నగరంలోకి వచ్చేందుకు కేవలం మూడు దారులు మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బయట వ్యక్తులెవరూ వచ్చేందుకు వీలు లేదని చెప్పారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.
రేపటి నుంచి కడప లాక్డౌన్లో మరిన్ని ఆంక్షలు - కడప జిల్లా తాజా కొవిడ్ సమాచారం
కడపలో మంగళవారం నుంచి లాక్డౌన్ అమలు మరింత పటిష్ఠంగా ఉంటుందని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
కడపలో లాక్డౌన్ కట్టుదిట్టం