kadapa sub court on Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు కడప సబ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెండేళ్ల కిందట వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలతో ఎర్రగంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 90 రోజుల తర్వాత అతను బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా ఇదే కేసులో అరెస్ట్ చేయాలంటే గతంలో ఉన్న బెయిలును రద్దు చేయాలని సీబీఐ.. కడప సబ్ కోర్టులో ఇటీవలే పిటిషన్ వేసింది. దీనిపై విచారణ సాగుతూ వాదనలు కూడా ముగిశాయి.
Viveka Murder Case Updates: ఎర్ర గంగిరెడ్డికి ఊరట.. సీబీఐ పిటిషన్ డిస్మిస్! - YS Viveka Murder Case
CBI Petition DISMISSED in Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై కడప సబ్ కోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![Viveka Murder Case Updates: ఎర్ర గంగిరెడ్డికి ఊరట.. సీబీఐ పిటిషన్ డిస్మిస్! Viveka Murder Case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13779478-1003-13779478-1638281948358.jpg)
YS Viveka Murder Case
CBI Petition DISMISSED against Erra Gangi Reddy: ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు... సీబీఐ పిటిషన్ను తిరస్కరించింది. కాగా వివేకా హత్య కేసులో ఇవాళ మరో ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు కడపలో విచారించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన ఇద్దరు అనుమానితులను ప్రశ్నించారు.
ఇదీ చదవండి:Jagan Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోకు హైకోర్టు షాక్