కడప జిల్లా రాజంపేటకు చెందిన నారాయణ కువైట్‌లో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఇథియోపియా దేశానికి చెందిన సెటయే అనే మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ పరిచయంతో 2015లో ఆమెను నారాయణ రాజంపేటకు తీసుకొచ్చాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెను ఇక్కడే ఉంచి జీవనోపాధి కోసమని మళ్లీ కువైట్ వెళ్లాడు. ఆమెకు డబ్బు పంపించేవాడు. ఈ క్రమంలో దురదుష్టవశాత్తు ఏడాది క్రితం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఇథియోపియా మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. స్థానికులు.. ఆమె దీన స్థితిని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్‌కు వివరించారు. ఆయన వెంటనే స్పందిస్తూ.. ఇథియోపియా ఎంబసీ అధికారులతో మాట్లాడి వీసా తెప్పించారు. ఆమెను ఇథియోపియా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులను బందోబస్తుగా పంపించి ఇవాళ ముంబై నుంచి ఆమెను విమానంలో స్వస్థలానికి పంపించారు. ఎస్పీకి ఆ మహిళ ధన్యవాదాలు తెలిపారు.
రాజంపేటలో ఉంటున్న విదేశీ మహిళకు కడప ఎస్పీ చేయూత.. - kadapa sp anburajan help to foreign human
దేశం కాని దేశంలో చిగురించిన ప్రేమతో ప్రియుడితో కలిసి భారత్‌కు వచ్చింది ఓ మహిళ.. ఆమెను కడప జిల్లా రాజంపేటలో ఉంచిన అతను ఉపాధి నిమిత్త కువైట్ వెళ్లి మృతి చెందాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళ స్వదేశానికి వెళ్లలేక పోయింది. అందుకు కారణం ఆమె వీసా గడువు ముగియడమే.. రాజంపేట వాసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడారు. ఆమెను స్వస్థలానికి పంపి మానవత్వం చాటుకున్నారు.
పోలీస్ అధికారి అంబురాజన్ మానవతా దృక్పథం