కడప జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్‌లు, బఫర్ జోన్‌లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించి నిఘా పెంచారు. జిల్లా ప్రజల సహకారంతో కరోనాను తప్పనిసరిగా తిప్పికొడతామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అంటున్నారు.
కరోనాను తిప్పికొడతాం: కడప ఎస్పీ అన్బురాజన్ - కరోనా వార్తలు
కడప జిల్లాలో కరోనా కేసులు నమోదైనందున లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశామని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
![కరోనాను తిప్పికొడతాం: కడప ఎస్పీ అన్బురాజన్ kadapa sp anbhu rajana on lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6621559-420-6621559-1585740429179.jpg)
కడప లాక్డౌన్పై మాట్లాడుతున్న ఎస్పీ