ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2019, 8:00 PM IST

ETV Bharat / city

అటవీ ప్రాంతంలో తప్పిపోయిన యువకులను రక్షించిన పోలీసులు

ఆపదలో ఉన్నపుడు 100 కు ఫోన్ చేస్తే చాలు... అందరినీ ఆదుకుంటామంటూ అభయమిస్తున్నారు పోలీసులు. చెప్పినట్లుగానే... అటవీ ప్రాంతంలో తప్పిపోయి వందకు డయల్​ చేసిన 18 మంది యువకులను కడప పోలీసులు రక్షించారు. అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలించి, యువకుల ఆచూకీ కనిపెట్టి సురక్షితంగా తీసుకొచ్చారు.

kadapa police save missing 18 young people
డయల్​ 100... నో డేంజర్​

అటవీ ప్రాంతంలో తప్పిపోయిన యువకులను రక్షించిన పోలీసులు

కడప జిల్లా అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 18 మంది యువకులను పోలీసులు రక్షించారు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ ప్రాంతంలో అణువణువూ గాలించి యువకుల ఆచూకీ గుర్తించారు. నీరసించిన యువకులకు అల్పాహారం, మంచినీరు అందించి మేమున్నామని ధైర్యం చెప్పారు.

ఇలా తప్పిపోయారు

కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ప్రారంభమైన ఆరాధనోత్సవాలు చూసేందుకు.. కర్నూలు జిల్లాకు చెందిన 18 మంది యువకుల బృందం బయల్దేరింది. అటవీ ప్రాంతంలో దారి తెలియక తప్పిపోయిన యువకులు.. ఆందోళన చెంది 100కు డయల్​ చేశారు. దీనిపై హుటాహుటిన స్పందించిన పోలీసులు అటవీ ప్రాంతమంతా గాలించి యువకులను రక్షించారు. తమ జీవితాలను కాపాడిన జిల్లా పోలీస్​శాఖకు జీవితాంతం రుణపడి ఉంటామని యువకుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. యువకులను కాపాడిన స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించారని, మున్ముందు ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఇవీ చూడండి:

దొంగనోట్లు, గంజాయి ముఠా గుట్టురట్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details