రెండు వేర్వేరు కేసుల్లో ముగ్గురు ఘరానా మోసగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7 లక్షల 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన రవిరెడ్డికి వ్యాపార నిమిత్తం రుణం అవసరం కాగా.. తన స్నేహితులైన అనిల్ కుమార్, శ్రీనివాసులును సంప్రదించారు. వారు కడపకు చెందిన ఆవుల ప్రభాకర్‌ను రుణం కావాలని అడగగా... తనకు కమిషన్ ఇస్తే రుణం ఇప్పిస్తానంటూ చెప్పాడు. అందుకు సమ్మతించిన ఇద్దరు కమిషన్ ఇచ్చేందుకు రూ. లక్ష నగదు తీసుకుని కడప గాంధీ నగర్ స్కూల్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆవుల ప్రభాకర్, సాహెబ్, దస్తగిరి... అనిల్ కుమార్, శ్రీనివాసులు వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ నోట్లు అందజేశారు. అనిల్, శ్రీనివాసులు ఇంటికి వెళ్లి చూడగా అందులో డబ్బులు లేవు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు. మరో కేసులో రూ. 3.56 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
రెండు వేర్వేరు కేసుల్లో రూ. 7.40 లక్షలు స్వాధీనం - kadapa dsp suryanarayana latest news
రెండు వేర్వేరు కేసుల్లో ఘరానా మోసగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగదును స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.

ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్ చేసిన కడపపోలీసులు