కడప పోలీసు మైదానంలో శనివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేడుకలు నిర్వహిస్తున్నామని కడప నగర పాలక కమిషనర్ లవన్న తెలిపారు. భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. శకటాలను నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని స్పష్టం చేశారు.
వేడుకలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్ ధరించాలి: నగర కమిషనర్ - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కడప పోలీసు మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరు కానున్నారు. ఈమేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కడప నగర పాలక కమిషనర్ తెలిపారు.
kadapa municipal commissioner