ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లా కేంద్రంగా.. రాజంపేట కోసం 'ఉడుము'పట్టు - అన్నమయ్య జిల్లా ఏర్పాటు వివాదం

కొత్తగా ఏర్పాటుచేయున్న అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. ఏదైమైనా తమ కోరిక నెరవేర్చాలని కోరుతూ అధికార పార్టీకి తమ మద్దతు విరమించుకుంటున్నట్లు ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

జిల్లా కేంద్రంగా.. రాజంపేట కోసం 'ఉడుము'పట్టు
జిల్లా కేంద్రంగా.. రాజంపేట కోసం 'ఉడుము'పట్టు

By

Published : Jan 30, 2022, 7:44 PM IST

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లి గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. పుల్లంపేట మండలం ప్రధాన రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వైకాపాకు పార్టీకి సెలవు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా కేంద్రంగా.. రాజంపేట కోసం 'ఉడుము'పట్టు

ABOUT THE AUTHOR

...view details