ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దసరా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు - కడప నేటి వార్తలు

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించేందుకు కడప జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. 935 బస్సులను అందుబాటులోకి తెచ్చినట్టు కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

kadapa-district-rtc-officers-prepared-special-buses-for-dussehra-festival
దసరా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు

By

Published : Oct 14, 2020, 5:37 PM IST

దసరా పండుగ సందర్భంగా... కడప ఆర్టీసీ జోన్ పరిధిలో 935 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బెంగళూరు, విజయవాడ, చెన్నై, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాలకు ఈ బస్సులను ఏర్పాటు చేశారు. అనుమతి రానందున హైదరాబాద్​కు నడపడం లేదని తెలిపారు.

అనుమతి రాగానే 200 సర్వీసులను నడుపుతామని కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదాం సాహెబ్ తెలిపారు. వీటినకి ముందస్తు రిజర్వేషన్ ఏర్పాటు చేశామని, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని సర్వీసులను నడుపుతామన్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details