కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మేయర్ సురేశ్ బాబు అన్నారు. ఆయన అధ్యక్షతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. నగరంలో చేపట్టే వివిధ పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తామని మేయర్ అన్నారు.
నగరంలో ఇప్పటికే రూ. 700 కోట్లతో అనేక అభివద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో దేవునికడప చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు.