ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WATER LILLY: ఆకట్టుకుంటున్న జెయింట్ వాటర్ లిల్లీ ఆకులు - joint water lilly leaves in yogi vemana university

కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో జెయింట్ వాటర్ లిల్లీ ఆకులు ఆకట్టుకుంటున్నాయి. రెండు మీటర్ల వ్యాసం, వెడల్పుతో ఉండి, వెనుక భాగం ముళ్లు కలిగి ఉన్నాయి.

ఆకట్టుకుంటున్న జెయింట్ వాటర్ లిల్లీ ఆకులు
ఆకట్టుకుంటున్న జెయింట్ వాటర్ లిల్లీ ఆకులు

By

Published : Sep 30, 2021, 10:37 PM IST

కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్‌ గార్డెన్‌ కొలనులో జెయింట్‌ వాటర్‌ లిల్లీ ఆకు చూపరులను ఆకట్టుకుంటోంది. ఇది రెండు మీటర్ల వ్యాసం వెడల్పుతో ఉండి.. 40 కిలోల బరువు మోయగలదు. దీన్ని వర్సిటీకి చెందిన గార్డెన్‌ నిర్వహకులు మధుసూదన్‌ రెడ్డి 2009లో కొల్‌కతా బొటానికల్‌ గార్డెన్‌ నుంచి తీసుకొచ్చి నాటారు. ఇది మూడు నెలలకొకసారి 2.5 మీటర్ల వెడల్పు పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన జెయింట్‌ వాటర్‌ లిల్లీ ఆకులు.... ఇక్కడ100 వరకు ఉన్నాయి. ఈ ఆకుకు వెనకాల భాగం ముళ్లు కలిగి ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details