తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం కడప జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల పీపీఈ కిట్ ధరించి బయటకి వచ్చారు. ఆయన డ్రైవర్ కూడా జాగ్రత్తలు పాటించి పీపీఈ కిట్ ధరించాడు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు నేరుగా వెళ్లిపోయారు. కరోనా చికిత్సకు హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్తున్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం కడప జైలులో 317 మంది ఖైదీలకు, జైలు సిబ్బందికి కరోనా కేసులు నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లిన జేసీకు ఈ మహమ్మారి సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కడప కేంద్ర కారాగారం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల - kadapa central jail latest news
అట్రాసిటీ కేసులో కడప జైలుకు వెళ్లిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జైసీ ప్రభాకర్ రెడ్డి గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వాటి పత్రాలు తీసుకుని ఆయన అనుచరులు సాయంత్రం కడప కేంద్ర కారాగారంలో జైలు అధికారులకు అందజేశారు. అక్కడ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్‌కు చికిత్సకు వెళ్లినట్టు ఆయున కుటుంబ సభ్యులు తెలిపారు.
బెయిల్‌పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి