Pawan Kalyan in Kadapa ఇవాళ ఉమ్మడి కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. సిద్ధవటం మండలంలో బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి కడపకు వెళతారు. మూడేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో 173 మంది కౌలు రైతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి పవన్ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు మెుత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సిద్ధవటం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సిద్ధవటం పర్యటన తర్వాత పవన్ తిరుపతి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
Pawan Kalyan కడపలో నేడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర - కడప జిల్లాలో కౌలు రైతులకు పవన్ సాయం
Pawan Kalyan in Kadapa నేడు ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బాధిత కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు.
పవన్ కల్యాణ్