ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

selfie video viral: మాట వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానన్నారు..యువకుడి సెల్ఫీవీడియో

కడప జిల్లాలో ఓ మైనారిటీ కుటుంబం(minority famiy).. తమకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య(suicide) చేసుకుంటామని తీసిన సెల్ఫీ వీడియో(selfie video) సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది. తమ భూమిని స్థానిక వైకాపా నేత తిరుపాల్ రెడ్డి పోలీసుల అండతో ఆక్రమించాడని(land kabja) బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోపై స్పందించిన సీఎం కార్యాలయం(cm office).. ఏడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కడప జిల్లా అధికారులను ఆదేశించింది. బాధిత కుటుంబాన్ని బెదిరించిన సీఐ కొండారెడ్డి(ci kondareddy)పై చర్యలు చేపట్టింది.

భూమి ఆక్రమించారని ఆవేదన
భూమి ఆక్రమించారని ఆవేదన

By

Published : Sep 11, 2021, 7:18 PM IST

Updated : Sep 12, 2021, 6:57 AM IST

భూమి ఆక్రమించారని ఆవేదన

సీఎంవో ఆదేశాల మేరకు వారంలో సమస్య పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నా సమస్యపై సీఎం కార్యాలయం కూడా ఎస్పీకి ఫోన్ చేసి ఆరా తీసింది. 2009లోనే భూమిని మా కుటుంబం రిజిస్ట్రేషన్ చేసుకుంది. వైకాపా నేత తిరుపాల్‌రెడ్డి కుటుంబం భూమి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సీఐ కొండారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -అక్బర్ బాషా, బాధితుడు

‘నంద్యాలలో మైనారిటీ కుటుంబం మాదిరి సెల్ఫీ వీడియో తీస్తున్నా. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో నాకున్న ఎకరన్నర భూమిని వైకాపా నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. శుక్రవారం సాయంత్రం మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి మమ్మల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. తిరుపేలరెడ్డి చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని హెచ్చరించారు. సీఎం జగన్‌ సర్‌.. ఇదెక్కడి అన్యాయం సర్‌. మీ పాలనలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. నేను కూడా వైకాపా కార్యకర్తనే. ఈ వీడియో మీకు చేరుతుందనే ఆశిస్తున్నా. సోమవారం సాయంత్రంలోగా న్యాయం జరగకపోతే మా నలుగురు కుటుంబీకులం ఆత్మహత్య చేసుకుంటాం. మా శవాలను చూసైనా మనసు కరుగుతుందని ఆశిస్తున్నా సర్‌..’ ఇది కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌బాషా కన్నీరుపెడుతూ శుక్రవారం రాత్రి 11.30కు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో. విస్తృత ప్రచారమైన ఈ సంఘటన వివరాలివి.

భూమిపై కోర్టులో కేసుంది...!

అక్బర్‌బాషా కుటుంబం దువ్వూరు మండల సమీపంలోని కర్నూలు జిల్లా చాగలమర్రిలో నివసిస్తోంది. సర్వేనంబరు 325లో ఎకరన్నర భూమిని తన భార్య అప్సానాను పెంచిన తల్లి కాశీంబీ 2009లో దానవిక్రయం కింద రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారని అక్బర్‌బాషా చెబుతున్నారు. భూమి కాశీంబీ పేరుతో అనువంశికంగానే ఉందని భావించి 2012లో వైకాపా నేత తిరుపేలరెడ్డి ఇందులో ఎకరం భూమి ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ భూమిని తిరుపేలరెడ్డి తన కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారంటూ మైదుకూరు సివిల్‌ కోర్టులో తాము వేసిన వ్యాజ్యం కొనసాగుతోందని అక్బర్‌బాషా వివరించారు. ఇదే క్రమంలో తమ కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం మైదుకూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌కు పిలిపించారని తెలిపారు. తాజాగా తిరుపేలరెడ్డి కుటుంబం ఈ పొలంలో నాట్లు వేయించిందని అక్బర్‌ ఆరోపించారు. దీన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్తూ కుందూ నదిలో దూకాలని నిర్ణయించుకున్నామని, ఇద్దరు పిల్లలుండడంతో ఇంటికి వెళ్లి ఆలోచించామని అక్బర్‌బాషా దంపతులు తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కడప ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఒప్పందం రద్దు..

2009లో చేసిన దాన విక్రయ ఒప్పందాన్ని కాశీంబీ రద్దు చేసుకుని తిరుపేలరెడ్డి కుమారుడికి ఎకరం భూమి విక్రయించారు. అనంతరం 2012లో న్యాయస్థానంలో కేసు దాఖలైనప్పటినుంచి ఈ భూమి సేద్యం కావడం లేదు. సుమారు ఏడాది కిందట తీర్పు వచ్చాక తిరుపేలరెడ్డి తన బంధువుకు ఈ భూమిని కూడా విక్రయించారు. తాజాగా వారు సేద్యానికి సిద్ధమవడంతో మళ్లీ వివాదమేర్పడింది.

బలవంతంగా సంతకాలు: కాశీంబీ

‘అప్సానా నా పెంపుడు కుమార్తె కాదు. ఆమె నా సోదరుడి కుమార్తె. ఎకరన్నర భూమికి, అక్బర్‌బాషా కుటుంబానికి సంబంధం లేదు. నాకు మత్తుమందిచ్చి బలవంతంగా పత్రాలపై లోగడ సంతకాలు పెట్టించుకున్నారు. అక్బర్‌బాషా చెప్పేవన్నీ అవాస్తవాలు. భూమికి సంబంధించి అసలు పత్రాలు నా వద్దే ఉన్నాయి’ అని కాశీంబీ కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు తెలిపారు.

స్పందించిన సీఎం కార్యాలయం

అక్బర్‌బాషా సెల్ఫీవీడియో వ్యవహారంపై సీఎం కార్యాలయం స్పందించింది. కడప ఎస్పీ అన్బురాజన్‌నుంచి వివరాలను సేకరించింది. అనంతరం బాధిత కుటుంబాన్ని ఎస్పీ పిలిపించగా.. వారు కడప మేయర్‌ సురేష్‌బాబు, మైనారిటీ నేతలతో కలిసి వచ్చి కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అక్కడికక్కడే ఎస్పీ సీఎం కార్యాలయం అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

భూమి ఆక్రమించారని ఆవేదన

అక్బర్‌ బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించాం. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో బాషా పిటిషన్‌ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాం. సీఐ కొండారెడ్డిని 2 రోజులపాటు విధుల నుంచి తప్పించాం. - ఎస్పీ అన్బురాజన్, కడప జిల్లా

సీఐ కొండారెడ్డిపై వేటు

మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. అప్పటివరకు సీఐని విధుల నుంచి తప్పిస్తున్నామని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని అన్నారు. సెల్ఫీవీడియో పోస్టు చేయగానే చాగలమర్రి, మైదుకూరు పోలీసులను అప్రమత్తం చేసి బాధిత కుటుంబం అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడామని, పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 9న ‘స్పందన’లో అక్బర్‌బాషా పిటిషన్‌ ఇచ్చారని, దానిపై విచారిస్తుండగానే ఈ వీడియో వైరల్‌ అయ్యిందని తెలిపారు.

పోలీసులే దౌర్జన్యం చేస్తే దిక్కెవరు?: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: పోలీసులే బాధితులపై దౌర్జన్యానికి దిగితే సామాన్యులకు దిక్కెవరని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అక్బర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కొందరు పోలీసులు సివిల్‌ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైందని శనివారం ట్వీట్‌ చేశారు.

అనుబంధ కథనాలు

Last Updated : Sep 12, 2021, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details