ICDS Pd Cried: కడపలో శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఐసీడీఎస్ పీడీ పద్మజ కన్నీటి పర్యంతమయ్యారు. జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఐసీడీఎస్‌పై జరిగిన చర్చ పెద్ద దుమారం రేపింది. పెండింగ్ బిల్లులపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లలేమని ఆందోళన వ్యక్తం చేశారు.
ICDS PD Cried: ఐసీడీఎస్ పీడీ కన్నీటిపర్యంతం.. ఎందుకంటే..! - ఐసీడీఎస్ పీడీ కన్నీటిపర్యంతం
ICDS Pd Cried: కడపలో శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఐసీడీఎస్ పీడీ పద్మజ కన్నీటి పర్యంతమయ్యారు. పెండింగ్ బిల్లులపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యుల మాటలు దారుణంగా ఉన్నాయని, తాను విమర్శల్ని ఒప్పుకోనని ఐసీడీఎస్ పీడీ పద్మజ అన్నారు. మీరంతటి నిజాయితీ వ్యక్తులా? అని సభ్యులు ప్రశ్నించగా, అవునని పీడీ గట్టిగా సమాధానమిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
తన నియోజకవర్గంలో నియామకాలు, ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు జరిగాయని, తన మాటకు విలువ ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మండిపడ్డారు. స్థానికంగా పనిచేసే సీడీపీవో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలివీడు, పుల్లంపేట జడ్పీటీసీ సభ్యులు సైతం ఐసీడీఎస్ పనితీరును ఎండగట్టారు. సభ్యుల మాటలు దారుణంగా ఉన్నాయని, తాను విమర్శల్ని ఒప్పుకోనని ఐసీడీఎస్ పీడీ పద్మజ అన్నారు. విమర్శల్ని ఒప్పుకోకపోతే మిమ్మల్ని పొగడమంటారా? అంటూ సభ్యులు నిలదీశారు. మీరంతటి నిజాయితీ వ్యక్తులా? అని సభ్యులు ప్రశ్నించగా, అవునని పీడీ గట్టిగా సమాధానమిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పీడీపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. పీడీ తాను నిజాయితీ వ్యక్తినేనంటూ స్పష్టంచేశారు. అప్పుడు మంత్రి సురేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏవమ్మా..! సభ్యులు అవినీతి ఆరోపణలు చేస్తే ఓపికగా సమాధానమివ్వాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకురాలిగా మాట్లాడుతున్నావని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. మైదుకూరు సీడీపీవోను బదిలీ చేయడంతోపాటు నియామకాలు, ఉద్యోగోన్నతులపై సమీక్షిస్తామని కలెక్టరు విజయరామరాజు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:movie ticket rates: పేదోడికి అందుబాటులో వినోదం అంటూనే ... ఆర్‌ఆర్‌ఆర్ కోసం..