కడప జిల్లా పులివెందులలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న వెండి వస్తువులను పులివెందుల ఎస్ఈబీ అధికారులు పట్టుుకున్నారు. పులివెందుల మండలంలోని నామాలగుండు వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 57కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకుండా తరలిస్తున్న సరకును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి వస్తువుల వివరాలను జిల్లా అధికారులకు అందించారు.
భారీగా వెండి సామగ్రి పట్టివేత... విలువెంతంటే..? - kadapa district crime
కడప జిల్లాలో రూ.38 లక్షల విలువైన వెండి సామగ్రిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. నామాలగుండు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 57 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
భారీగా వెండి సామగ్రి పట్టివేత