కడప మృత్యుంజయకుంటకు చెందిన రవి నాయక్.. ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు. అతను నాలుగు నెలల క్రితం చిక్కుడుకాయ మొక్కను తన ఇంటి సమీపంలో నాటారు. అది కాస్తా పెరిగి పెద్దదై.... అతని ఇల్లు మొత్తాన్ని కప్పేసింది. దూరం నుంచి చూస్తే అదేదో తీగలతో అల్లుకున్న గూడు అనుకుంటారు. కానీ ఆ తీగల కింద ఇల్లు ఉందనే విషయం దగ్గరికి వెళ్తే గాని గుర్తు పట్టలేరు. అందుకే.. దారి వెంట వచ్చి పోయే వాళ్లు... రెండు నిమిషాలు ఆగి తదేకంగా ఇంటిని చూసి వెళతారని యజమాని చెప్తున్నారు.
రవి నాయక్.... ఆ మొక్కను తన సొంత బిడ్డ వలె చూసుకుంటారు. చీడపీడల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు కనీసం 20 కిలోల చిక్కుడుకాయలు వస్తాయని తెలిపారు. ఇంట్లో ఎప్పుడూ చల్లగా ఉంటుందన్నారు. వేసవికాలంలోనూ ఏసీలు, కూలర్లు అవసరం లేదని చెప్పారు.