కడపకు చెందిన సుమారు 100 మంది హిజ్రాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే రావాలని నినదించిన హిజ్రాలు... తమ కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేసి వ్యక్తి ఆయనేనని కీర్తించారు. తమ పాలిట దైవమయ్యారని కితాబిచ్చారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా సమాజంలో తమకు గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి సాయం చేస్తామని ప్రకటించారు.
'సమాజంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబే' - హిజ్రా
ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేసి తమ పాలిట దైవమై నిలబడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తించారు హిజ్రాలు. తమకూ ఓ గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
తెదేపాలో చేరిన 100మందికి పైగా హిజ్రాలు