ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HEAVY RAINS IN KADAPA DISTRICT : ఎడతెరిపి లేని వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు

వారం రోజుల క్రితం కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే.. కడప జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు(Heavy rains in kadapa district) పడుతున్నారు. గండికోట, మైలవరం జలాశయాలకు పైనుంచి వరద కొనసాగుతున్నందున.. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

కడప జిల్లాలో మళ్లీ వర్షాలు
కడప జిల్లాలో మళ్లీ వర్షాలు

By

Published : Nov 28, 2021, 6:50 PM IST

Updated : Nov 28, 2021, 11:58 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి(People problems with rains in kadapa). అనేక గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిట్వేలు మండలంలోని ఎల్లమరాజు చెరువు నిండి అలుగు పారుతోంది. గుంజన ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బద్వేలులో ఏకధాటిగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్టీసీ గ్యారేజ్, విద్యుత్ ఉప కేంద్రాల్లోకి వర్షపు నీరు చేరింది.


గండికోట నుంచి మైలవరానికి 20 వేల క్యూసెక్కులు

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో గండికోట జలాశయానికి(water release from Gandikota Reservoir) భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయంలో ప్రస్తుతం 23.96 టీఎంసీలుగా ఉంది. గండికోటకు 20 వేల క్యూసెక్కుల వరద వస్తోండగా.. అంతే మొత్తంలో మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరంలో ప్రస్తుతం 3.66 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నందున అప్రమత్తమైన అధికారులు.. మైలవరం నుంచి పెన్నా నదికి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక(heavy floods in penna river) ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీచదవండి.

Last Updated : Nov 28, 2021, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details