కడపలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షం నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. గ్యారేజీ మొత్తం బ్యారేజీని తలపించింది. వర్షం నీటిలో కార్మికులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. నగరంలోని ఆర్టీసీ కార్మికుల భవనాలు, భరత్ నగర్, వై జంక్షన్, రాజంపేట బైపాస్ రోడ్డు, అప్సర కూడలి, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీ, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పలు కాలనీల్లోకి మీరు వెళ్లడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.
కడపలో భారీ వర్షం.. ఆర్టీసీ గ్యారేజీలోకి వరద నీరు - కడప జిల్లాలో భారీ వర్షం
కడప జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ గ్యారేజీలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం నీటిలోని కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కడపలో భారీ వర్షం.. ఆర్టీసీ గ్యారేజీలోకి వరద నీరు