ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాయితీతో పశుగ్రాసం కత్తిరింపు యంత్రాలు'

పశుగ్రాసం వృథాను అరికట్టి.. పాడి దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం రాయితీతో పశుగ్రాసం యంత్రాలను అందిస్తోంది.అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో 50శాతం రాయితీతో పంపిణీ చెస్తోంది.

By

Published : Jul 3, 2019, 6:29 AM IST

'రాయితీతో పశుగ్రాసం కత్తిరింపు యంత్రాలు'

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు పాడి పెంపంకంపై ఆధారపడుతున్నారు. ఇందులో భాగంగా... కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పశుగ్రాసం కత్తిరింపు యంత్రాలను రాయితీతో ప్రభుత్వం అందిస్తోంది. గ్రాసాన్ని అంతే మొత్తంలో పశువులకు వేస్తే... అవి కేవలం లేతగా ఉన్న భాగాన్ని మాత్రమే తిని... కాండాన్ని అలాగే వదిలేస్తున్నాయి. దీని వల్ల చాలా పెద్ద మొత్తంలో గ్రాసం వృధా అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గడ్డి కత్తిరింపు యంత్రాల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి..పశువులకు అందించటం వల్ల... వృథా అరికట్టడమే కాకుండా పాల దిగుబడిలో గణనీయమైన పెరుగుదల ఉంటోందని రాయచోటి పశుసంవర్థక శాఖ సహాయకులు గుణశేఖర్ తెలిపారు. 50శాతం రాయితీతో అందిస్తున్న ఈ యంత్రాలను పాడి రైతులు వినియోగించుకుంటే..లాభసాటిగా మారుతుందని ఆయన సూచించారు.

'రాయితీతో పశుగ్రాసం కత్తిరింపు యంత్రాలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details