రాష్ట్రానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు... ఇక్కడ ప్రజల భౌతిక దూరంపై మాట్లాడటం సిగ్గుచేటని... ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చొని కాలక్షేపానికి టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'సీఎం జగన్‌పై బురదజల్లడం మంచిది కాదు' - mla srikanth reddy latest pressmeet news in kadapa
ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని కాలక్షేపానికి టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి... ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారనే విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైన గుర్తించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్‌మీట్
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై మాట్లాడుతున్న చంద్రబాబు... వాటికి అనుమతించిన కేంద్రంపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఊరూరా బెల్టుషాపులు పెట్టించిన సంగతిని మరచి... మద్యపాన నిషేధం కోసం ధరలు పెంచుతున్న సీఎం జగన్‌పై బురదజల్లడం మంచిది కాదని హితవుపలికారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారనే విషయం ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించాలి పేర్కొన్నారు.