ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROBBERY: నగరంలో రెండు చోట్ల చోరీలు..బంగారం, వెండి అపహరణ - kadapa news

కడప నగరంలో రెండు వేరు వేరు చోట్లు చోరీలు జరిగాయి. ఇందులో బంగారం, వెండి అపహరణకు గురైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ROBBERY
ROBBERY

By

Published : Sep 28, 2021, 12:17 AM IST


కడప నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన చోరీల్లో బంగారు ఆభరణాలు, వెండి అపహరణకు(gold and silver robbed in two various incidents) గురైంది. కడప ఎస్బీఐ కాలనీకి చెందిన విజయలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. నేడు కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె తేరుకుని చూసేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

గుర్రాల గడ్డకు చెందిన జయబున్నిస అనే మహిళ ఈ నెల 18న కుమార్తె ఇంటికి వెళ్లింది. ఇవాళ ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే ఆమె ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. మూడున్నర తులం బంగారం ఆభరణాలు, 50 గ్రాముల వెండి చోరీకి గురైనట్లు గమనించింది. రెండు ఘటనల్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details