క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా.. గ్లోబల్ గ్రేస్ రన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కడపలో ఎస్పీ(kadapa sp) ఆధ్వర్యంలో 3కే.రన్(3k run) చేపట్టారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పోలీసులు 2కే. రన్(2k run) నిర్వహించారు. ఉరవకొండలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ కార్యక్రమంలో మూడు మండలాల పోలీసులు, ఆశ కార్యకర్తలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Global grace run : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ - Global Grace Cancer Run at various places in andhrapradhesh
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్(global grace run) కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన(awareness) కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో.. వైద్యులు, పోలీసులు పాల్గొన్నారు.
![Global grace run : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ రాష్ట్రవ్యాప్తంగా గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13314526-1095-13314526-1633850952478.jpg)
రాష్ట్రవ్యాప్తంగా గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ రన్ నిర్వహించారు. కృష్ణా జిల్లా నూజివీడులో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. జిల్లాలోని మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేశారు.
ఇదీచదవండి.