కడప మారుతీ నగర్‌కు చెందిన నారాయణ కుటుంబసభ్యులు ఇంట్లో వంట చేస్తుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీకైన వాసన వచ్చింది. దీంతో వారందరూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం సిలిండర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. కొంత సామాను కాలిపోయింది. ఒకటిన్నర లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పెద్ద శబ్ధంతో సిలిండర్ పేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. లక్షన్నర ఆస్తి నష్టం - కడపలో పేలిన గ్యాస్ సిలిండర్ వార్తలు
కడప మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే ఇంట్లో ఉన్న సామాను కాలిపోవటంతో సుమారు ఒకటిన్నర లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెప్పారు.
కడపలో పేలిన గ్యాస్ సిలిండర్