Fraud to the tribes: అనంతపురం జిల్లాలోని తనకల్లు మండలంలో... గిరిజనులకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని పులివెందల గిరిజనులు ఆందోళన చేపట్టారు. మధు అనే వ్యక్తి వద్ద 18 మంది ఇళ్ల స్థలం కొనుగోలు చేశామని, తీరా ఆ భూమిలో వేరే వాళ్లు కంచెలు వేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సంబంధిత భూమి ఆమ్మిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు స్పందించి తమను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భూమిని ఇప్పించలేని పక్షంలో కనీసం తాము కొనుగోలుకు కట్టిన డబ్బునైనా ఇప్పించాలని కోరారు.
ఆ భూములు మాకే కేటాయించాలి: పులివెందుల గిరిజనులు - అనంతపురం లెటెస్ట్ అప్డేట్
Fraud to the tribes: కూలీ కోసం వలస వెళ్లి, పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన భూముల్లో వేరొకరు కంచె వేయడాన్ని చూసి వారంతా నిర్ఘాంతపోయారు. తాము కొన్న భూముల్లో కంచె ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ ప్రతులు, రికార్డులు చూపడంతో మోసపోయామని అర్థమైంది. యజమానిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. అందుకే రోడ్డెక్కి నిరసన బాట పట్టారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనంతపురంలో గిరిజనులు