కడప జిల్లా రాజంపేటలో అటవీ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో నలుగురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట అటవీ రేంజ్ పరిధిలోని తుమ్మలపల్లి సెక్షన్లో బలసలమీది ప్రాంతంలో తమిళనాడుకు చెందిన 20 మంది స్మగ్లర్లు తారసపడగా వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఓలు రఘు శంకర్, వేణు ప్రసాద్ తెలిపారు. అక్కడ నుంచి తప్పించుకున్న వ్యక్తులు మరో ప్రాంతంలో ఎర్ర చందనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. బీడీ బావి సెక్షన్లోని ఎర్రమీది ప్రాంతంలో మరో ఇద్దరిని పట్టుకొని.. 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.1,43,542 ఉంటుందన్నారు.
రాజంపేటలో అటవీ అధికారుల దాడులు.. నలుగురు స్మగ్లర్ల అరెస్టు
కడప జిల్లా రాజంపేటలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డ నలుగురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ సుమారు రూ.1,43,542 ఉంటుందని తెలిపారు.
ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లు అరెస్టు