కడప జిల్లా రాజుపాలెం మండలంలోని విజయదుర్గ గోడౌన్(vijayadurga godown)లో సుమారు రూ.7 కోట్లు విలువైన శనగలు, ధనియాలను నిల్వ ఉంచారు. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చన్న తలంపుతో రైతులు గోడౌన్లో భద్రపరిచారు. ఈ క్రమంలో రైతులకు తెలియకుండా ఆ గోదాం యజమాని భరత్ కుమార్‌రెడ్డి... ధాన్యాన్ని(grain) విక్రయించి సొమ్ము చేసుకున్నారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రైతులు గతేడాది డిసెంబరులో ఆందోళన నిర్వహించారు. బాధితుల నిరసనతో... సమస్యను పరిష్కరిస్తామని రాజుపాలెం పోలీసులు సయోధ్య(understanding) కుదిర్చారు. గోదాంలో దాచిన ధాన్యం తాలూకు రశీదు(pay slip), ఇతర పత్రాల(documents)ను తీసుకుని యజమాని భరత్ రెడ్డి విక్రయించిన ధాన్యంకు బదులు నగదు చెల్లించేలా పంచాయితీ చేశారు. ఆరు నెలల్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బును చెల్లిస్తామని బాండ్లు(bonds) రాయించారు. ఈ పరిణామాల నడుమ గోడౌన్ యజమాని భరత్ కుమార్ రెడ్డి ఆత్మహత్య(suicide) చేసుకున్నారు.
డబ్బులు చెల్లించడంలో అలసత్వం...
ఇది జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా... డబ్బులు చెల్లించడంలో అలసత్వం(delay) వహిస్తున్నారని బాధిత రైతులు ఆందోళన చేశారు. పలుమార్లు పోలీస్టేషన్‌కు వెళ్లినా సరైన సమాధానం రాకపోవడంతో గోదాం యజమాని ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అయినా ఒక్క రూపాయీ చెల్లించలేదని మండిపడ్డారు. రైతులను మోసం చేశారంటూ భారతీయ కిసాన్ సంఘ్ నేతలు(bharathiya kisan sangh leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుని, గోడౌన్ యజమాని ఆస్తులను జప్తు చేసి, రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించకపోతే గోదాము యజమాని భరత్ కుమార్‌రెడ్డి తరహాలోనే బాధిత రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు(warning).