దొంగ నోట్లు, గంజాయి ముఠా గుట్టునుకడప పోలీసులురట్టు చేశారు. కామెరూన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు కడప, విశాఖకు చెందిన మరో ముగ్గురు ఈ నేరాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇటీవల స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నగరంలోని సిద్ధ ప్రియ లాడ్జిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కడపకు చెందిన సాయికృష్ణ, విశాఖ జిల్లా పాడేరుకు చెందిన దాసుబాబు, జగన్నాథం, ఇద్దరు నైజీరియన్లుగా గుర్తించారు. వీరి నుంచి 7 లక్షల 28 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, 9 కిలోల గంజాయి, ల్యాప్టాప్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దొంగనోట్లు, గంజాయి ముఠా గుట్టురట్టు - కడపలో దొంగనోట్ల ముఠా అరెస్ట్
కడపలో దొంగనోట్లు చలామణీ చేస్తూ.. గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు.
కడపలో దొంగనోట్లు, గంజాయి ముఠా గుట్టురట్టు