Fake CBI Officers Gang Arrest At Kadapa : సీబీఐ అధికారులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు గుర్తింపుకార్డులను 84 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి.. తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు.
Fake CBI Officers Gang Arrest: నకిలీ సీబీఐ అధికారుల ముఠా అరెస్ట్ - నకిలీ సీబీఐ అధికారుల ముఠాను అరెస్టు చేసిన కడప పోలీసులు
Fake CBI Officers Gang Arrest: కడప జిల్లాలో సీబీఐ అధికారుల పేరుతో డబ్బు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన నలుగురు నిందితులనుంచి ఒక వాహనంతోపాటు రూ. 84 వేల స్వాధీన చేసుకున్నట్లు కడప డీఎస్సీ వెంకటశివారెడ్డి తెలిపారు.
అనంతపురానికి చెందిన నాగేష్ నాయుడు, నెల్లూరుకు చెందిన సుందర రామయ్య, కడపకు చెందిన నవీన్ రాజ్, ప్రభాకర్ నాయక్ స్నేహితులు.. ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సీబీఐ అధికారుల మంటూ ఫోన్ కాల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారు. నవీన్ రాజుపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఖాజీపేట మండలం పత్తుర్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి నవీన్ రాజు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమంటూ బెదిరించి అతనిని వాహనంలో తీసుకెళ్లి లక్ష 14 వేల రూపాయలు డబ్బులు తీసుకుని రోడ్డుపై దించేసి పారిపోయారు. ఉదయ్ కుమార్ చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఈ నలుగురిని చెన్నూరు మండలం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి ఒక వాహనంతోపాటు రూ. 84 వేల నగదు స్వాధీన చేసుకున్నాం' అని డీఎస్సీ వెంకటశివారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి..CHEATING IN WEST GODAVARI : చిట్టీల పేరుతో మోసం...రూ.7కోట్లతో పరారీ..!