Gangi Reddy inViveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సాక్ష్యులను బెదిరించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్ ను కొట్టేయాలంటూ గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చేసిన వాదనలతో ఏకీభవించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Viveka Murder case : ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు - ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డికి దిగువ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
పులివెందుల కోర్టు జూన్ 2019 లో గంగిరెడ్డికి మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. గంగిరెడ్డి , ఆయన అనుచరులు సాక్ష్యులను తీవ్రంగా బెదిరిస్తున్నారని , ప్రలోభాలకు గురిచేస్తున్నారని వాదనలు వినిపించింది. బెదిరింపులకు దిగడంతో పలువురు సీఆర్పీసీ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రాలేదని వెల్లడించింది. బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ది ఆందోళన మాత్రమేనన్నారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి మొదట సిద్ధపడిన ఇన్స్పెక్టర్ శంకరయ్య , గంగాధర్ రెడ్డి , కృష్ణారెడ్డి తర్వాత విరమించుకుంటే గంగిరెడ్డికి ఏవిధంగా సంబంధం అన్నారు. అప్రూవర్‌గా మారిన షేక్ దప్తగిరి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో గంగిరెడ్డి బెదిరించినట్లు ప్రస్తావించలేదన్నారు. సీబీఐ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి :నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా
TAGGED:
viveka murder case