కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుండగా... నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వైకాపా, భాజపా మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేష్.. పోటీలో ఉన్నారు. రెండు పార్టీలు మరింతమంది కీలకనేతలను రంగంలోకి దించాయి. వైకాపా అభ్యర్థి తరఫున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా సభలు నిర్వహిస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. కేంద్రం విభజన హామీలను అమలు చేస్తామంటే భాజపాకే మద్దతిస్తామని పునరుద్ఘాటించారు.
BADVEL BY-POLL : బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర - badvel by-poll
కీలక నేతలు. మాటల తూటాలు. గెలుపు వ్యూహాలు..! ఇలా బద్వేలు ఉపఎన్నికల ప్రచార గడువు నేటితో ముగుస్తున్నందున పార్టీలు ఓట్ల వేట ముమ్మరం చేశాయి. వైకాపా, భాజపా కీలక నేతలతో సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. కేంద్రం విభజన హామీలు అమలు చేస్తే భాజపాకే మద్దతిస్తామని అధికార పార్టీ మరోసారి ప్రకటిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కాషాయదళం కోరుతోంది.
వైకాపాకు పోటీగా భాజపా నేతలు జోరుగా ప్రచారం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరి, అభ్యర్థి సురేష్ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లో మాదిరిగానే బద్వేలులో విజయం సాధిస్తామని అక్కడి ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని సురేష్ ఆరోపించారు. ఇక వైకాపా, భాజపాను నమ్మి ప్రజలు మోసపోవద్దంటూ కాంగ్రెస్ ఓట్లవేటలో నిమగ్నమైంది.
ఇదీచదవండి.