కరోనా సందర్భంగా మార్చి 1 నుంచి 4 రోజులు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఎవరో కావాలనే ఆకతాయిలు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, తాను సంతకం చేసి ఆదేశాలు ఇచ్చినట్లు తప్పుడు వార్తలు సృష్టించారని, అలాంటి వారిపై సైబర్ క్రైం కింద ఫిర్యాదు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ క్యాలెండర్ను కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. క్యాలెండర్ ప్రకారం జూన్ వరకు పాఠశాలలు నడుస్తాయని... వీటిలో ఎలాంటి అపోహలకు తావులేని విధంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.
పాఠశాలలకు సెలవులు.. కొట్టిపారేసిన విద్యాశాఖ మంత్రి - మంత్రి ఆదిమూలపు సురేష్ తాజా వార్తలు
పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్. ఈ విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
education minister adimulapu suresh