ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్య కేసు విచారణ ముమ్మరం...కీలక ప్రకటనకు అవకాశం! - viveka

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో... డీజీపీ గౌతం సవాంగ్ స్వయంగా రంగంలోకి దిగారు. పలు అంశాలపై సిట్ అధికారులు, ఎస్పీ అభిషేక్ మొహంతితో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసుపై ఇవాళ లేదా రేపటిలోగా కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.

తుది దశలో వివేకా హత్య కేసు విచారణ... రంగంలోకి దిగిన డీజీపీ

By

Published : Sep 5, 2019, 4:47 AM IST

ఈ ఏడాది మార్చి 15న... మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. వివేకా హత్యకేసులో ఇప్పటివరకు హంతకులెవరనేది ఇప్పటివరకు తెలియలేదు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో పాటు... అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి సోమవారం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ స్వయంగా రంగంలోకి దిగారు.

తుది దశలో వివేకా హత్య కేసు విచారణ... రంగంలోకి దిగిన డీజీపీ

పలు అంశాలపై సుదీర్ఘ సమీక్ష...

నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు... కడప ఎస్పీ అభిషేక్ మొహంతి, సిట్ అధికారులతో డీజీపీ సవాంగ్ సుదీర్ఘంగా సమీక్షించారు. హత్య కేసులో పురోగతి, ఎంతమందిని విచారించారు, ఏ కోణంలో ఆరా తీశారనే దానిపై డీజీపీ సవాంగ్ సుదీర్ఘంగా చర్చించారు. నార్కో అనాలసిస్ పరీక్షలకు గుజరాత్ వెళ్లి వచ్చిన ఎర్ర గంగిరెడ్డి, వాచ్ మెన్ రంగన్న, శేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి గురించీ అడిగినట్లు సమాచారం. ఈ సమయంలోనే జిల్లా కలెక్టర్ హరికిరణ్ కూడా దాదాపు అరగంట పాటు డీజీపీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సిట్ అధికారులపై అరోపణలు...రెండు లేఖలు

హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి చనిపోయే ముందు.... సిట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ కు, ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి... రెండు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీనివాసులరెడ్డి మరణాన్ని అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు

కీలక ప్రకటన వెల్లడించే అవకాశం...!

విషపు గుళికలు మింగి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురించి డీజీపీ అడిగి తెలుసుకున్నారు. విచారణకు పిలిస్తేనే ఆత్మహత్య చేసుకోవాల్సిన విషయం ఏమొచ్చింది. దీని వెనుక ఎవరున్నారనే కోణాలపై డీజీపీ ఆరా తీసినట్లు సమాచారం. లేఖలో రెండు రకాల చేతి రాతలపైనా వివరాలు అడిగారు. తర్వాత, రాత్రి 9 గంటల సమయంలో పులివెందులలోని వివేకా ఇంటికి డీజీపీ వెళ్లారు. హత్య జరిగిన ప్రదేశమైన బెడ్ రూం, బాత్ రూంను పరిశీలించారు. వివేకా కేసులో నిందితులెవరన్నది రేపటిలోగా వెల్లడించాలనే ఆలోచనతో సిట్ అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పరమేశ్వర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి- వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details