కడపను కరోనారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్భాషా పేర్కొన్నారు. గురువారం కోవిడ్ -19 జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 96 కరోనా పాజిటివ్ కేసులలో 40 నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ చేశామన్నారు. శుక్రవారం మరో మూడు నెగటివ్ కేసులు డిశ్చార్జ్ చేశామన్నారు. డిశ్చార్జ్ అయిన వారు ఎక్కడా తిరగకుండా మంచి ఆహారం తీసుకుంటూ 14 రోజులపాటు హోమ్ ఐసోలేషన్ పాటించాలన్నారు. ఫాతిమా మెడికల్ కళాశాలలో ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని అక్కడి వైద్యులకు సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు పట్టణంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా డిశ్చార్జ్ అయిన ముగ్గురు వ్యక్తులకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండు వేల రూపాయల నగదు, డ్రైఫ్రూట్స్, పండ్లు అందజేశారు.
'కరోనారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించండి' - కడప జిల్లా తాజా కోవిడ్ వార్తలు
కడపలోని కోవిడ్-19 ఆసుపత్రులను ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా సందర్శించారు. జిల్లాలో డిశ్చార్జ్ అయిన వారికి రెండు వేల రపాయల నగదు, పండ్లు అందజేశారు. కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి పండ్లు అందజేస్తున్నఉపముఖ్యమంత్రి