కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు డీసీసీ బ్యాంకు 20 లక్షల 32 వేల రూపాయల విరాళం ప్రకటించింది. ఎంపీ అవినాశ్ రెడ్డి సమక్షంలో డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి... జిల్లా కలెక్టర్ సహాయ నిధికి చెక్కును అందించారు. కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా వైరస్ను అదుపు చేయడానికి ప్రజలంతా సహకరించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరోనా నివారణకు డీసీసీ బ్యాంకు 20 లక్షలు విరాళం - డీసీసీ బ్యాంకు విరాళం
కరోనా వ్యాప్తి నివారణకు డీసీసీ బ్యాంకు 20 లక్షల 32 వేల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఈ చెక్కును కడప జిల్లా కలెక్టర్ సహాయ నిధికి బ్యాంకు ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి అందించారు.

dcc bank donation for corona